![దేవర మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్](https://static.v6velugu.com/uploads/2024/02/makers-announced-release-date-of-devara-movie_ld6kxEBCsw.jpg)
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘దేవర’. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రూపొందుతోంది. శుక్రవారం ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించగా.. కొన్ని కారణాలతో వాయిదా వేశారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌ను దసరా కానుకగా అక్టోబర్ 10న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఎన్టీఆర్ కొత్త స్టిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్ సినిమాపై బజ్‌ను పెంచింది. కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.