సక్సెస్ జోష్ లో ఫ్యాక్షన్ డ్రాప్ వెబ్ సిరీస్ కోబలి.. పార్ట్ 2 కూడా ఉందంట..!

సక్సెస్ జోష్ లో ఫ్యాక్షన్ డ్రాప్ వెబ్ సిరీస్ కోబలి.. పార్ట్ 2 కూడా ఉందంట..!

ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఫిబ్రవరి 4న రిలీజ్ అయిన 'కోబలి' వెబ్ సీరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 7 భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కి అన్ని రాష్ట్రాల ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ వెబ్ సీరీస్ కి  నార్త్ నుండి కూడా దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది.

ఈ వెబ్ సీరీస్ లో రవి ప్రకాష్, రాకీ సింగ్ ప్రధాన పాత్రలు పోషించగా.. తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగి ఖత్రి, శ్రీ పవన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నూతన రేవంత్ లేవాక దర్శకత్వం వహించగా 'నింబస్ ఫిలిమ్స్' 'యు1  ప్రొడక్షన్స్' 'టి.ఎస్.ఆర్ మూవీ మేకర్స్' సంస్థలపై జ్యోతి మెగావత్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి కామిరెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. 

Also Read :- వెయ్యి థియేటర్లలో లైలా మూవీ

కోబలి వెబ్ సీరీస్ మంచి హిట్ అవ్వడంతో మేకర్స్.. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసి మీడియా వారికి, ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిర్మాత రవి ప్రకాష్ మాట్లాడుతూ.. మీడియాకి,హాట్ స్టార్ కి, ప్రేక్షకులకి మాత్రం థాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నానని అన్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయ్యింది. కొత్తగా ఏదో ఒకటి చేయాలి అనే నమ్మకంతో 'కోబలి' మొదలుపెట్టాను. దీనిపై నమ్మకం పెట్టింది హాట్ స్టార్. ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లింది మీడియా. ఆదరించి పెద్ద విజయాన్ని అందించింది ప్రేక్షకులు. హానెస్ట్ గా పనిచేస్తే మంచి ఫలితం తప్పకుండా  వస్తుందని ఎమోషనల్ అయ్యారు.