OTT Family Drama: 90's బయోపిక్ తరహాలో ఓటీటీకి మరో తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

OTT Family Drama: 90's బయోపిక్ తరహాలో ఓటీటీకి మరో తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ లకు ఉండే ఆ క్రేజే వేరు. అందులో ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల నేపథ్యంలో వచ్చే సిరీస్ లుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు. అలా వచ్చిందే ‘#90s: ది మిడిల్ క్లాస్ బయోపిక్’.

ఈ వెబ్ సిరీస్ తెలుగు ఓటీటీల్లో రికార్డు బ్రేకింగ్ హిట్గా నిలిచింది. అంతేకాదు ఇండియాలోనే ఎక్కువ మంది మెచ్చిన వెబ్ సిరీస్గా మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు తెలుగులో మరో ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ రానుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. #90’s వెబ్ సిరీస్ ప్రొడ్యూజ్ చేసిన నవీన్ మేడారం నిర్మాణంలో ఈ కొత్త సిరీస్ రూపొందుతోంది. 

Also Read :- సింగర్ శ్రేయా ఘోషల్ ట్విట్టర్ హ్యక్డ్

లేటెస్ట్గా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ నేడు (మార్చి 1న) 'హోమ్ టౌన్' (Hometown) సిరీస్ స్ట్రీమింగ్ వివరాలు ప్రకటించింది. "జ్ఞాపకాలు, ప్రేమ, లక్ష్యాల ప్రయాణం. హోమ్ టౌన్ స్టోరీ మీ సొంత కథలా అనిపిస్తుంది. ఏప్రిల్ 4 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందని" ఆహా X లో పోస్ట్ చేసింది. ఈ మేరకు ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచింది. 

శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ 'హోమ్ టౌన్' సిరీస్లో నటుడు రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యద్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ పోస్టర్లో కనిపిస్తున్న క్యాలెండర్ ను బట్టి 2013లో నడిచే కథగా సిరీస్ రూపొందినట్లు తెలుస్తోంది. అలాగే పక్కన కనిపిస్తున్న పాత టేపిరికార్డు, ఆ ఇంట్లో కనిపించే పరిసరాలు బట్టి #90s: ది మిడిల్ క్లాస్ను గుర్తుచేసే విధంగా ఉంది. ఈ ఒక్క పోస్టర్ తోనే మేకర్స్ సిరీస్ పై ఇంట్రెస్ట్ పెంచేశారు.

ఇకపోతే ఈ 'హోమ్ టౌన్' సిరీస్కు సురేష్ బొబ్బిలి సంగీతం అందించనున్నాడు. #90s సిరీస్కు కూడా సురేష్ బొబ్బిలి సంగీతం అందించడం విశేషం. ఎస్‍ఏపీ, అమోఘో ఆర్ట్స్ బ్యానర్స్పై ఈ సిరీస్‍ను నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం ప్రొడ్యూజ్ చేస్తున్నారు. త్వరలో ఈ 'హోమ్ టౌన్' సిరీస్ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.