సతిగా సయీ మంజ్రేకర్ .. కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేసిన మేకర్స్

సతిగా సయీ మంజ్రేకర్ .. కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేసిన మేకర్స్

స్కంద, గని, మేజర్ లాంటి చిత్రాల్లో  గ్లామర్ రోల్స్‌‌‌‌తో ఆకట్టుకున్న  సయీ మంజ్రేకర్ తాజాగా కొత్త ప్రాజెక్టులోకి అడుగుపెట్టింది. అందులోనూ సాంప్రదాయంగా కనిపిస్తూ ఇంప్రెస్ చేసింది. మంగళవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ, ఇందులో తన పాత్రను పరిచయం చేశారు మేకర్స్. నిఖిల్ హీరోగా రామ్ వంశీ కృష్ణ రూపొందిస్తున్న ‘ది ఇండియా హౌస్’ చిత్రంలో హీరోయిన్‌‌‌‌గా సయీ మంజ్రేకర్ నటిస్తుందని ప్రకటించారు. 

ఇందులో ఆమె సతి పాత్రలో కనిపించనుందని రివీల్ చేశారు. ఈ సందర్భంగా తనకు బర్త్‌‌‌‌డే విషెస్ తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో బ్లూ కలర్ శారీలో తెలుగుదనం ఉట్టిపడేలా ట్రెడిషినల్‌‌‌‌గా కనిపిస్తూ ఆకట్టుకుంది.  1905 బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో పీరియాడిక్‌‌‌‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్‌‌‌‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో  వీ మెగా పిక్చర్స్‌‌‌‌, అభిషేక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌ పతాకాలపై విక్రమ్‌‌‌‌ రెడ్డి, అభిషేక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. మయాంక్‌‌‌‌ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.