వందేళ్ల అందానివే.. ‘విశ్వం’ నుండి మూడో పాట

వందేళ్ల అందానివే.. ‘విశ్వం’ నుండి మూడో పాట

గోపీచంద్, కావ్య థాపర్ జంటగా  శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్  బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించారు. మ్యూజిక్ ప్రమోషన్స్‌‌‌‌లో భాగంగా ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసిన టీమ్.. శుక్రవారం మూడో పాటను విడుదల చేసింది.

‘వస్తాను వస్తానులే.. వెనకే చేయి జారిపోకే.. వందేళ్ల అందానివే.. కనుకే కట్టుకోవే నన్ను వద్దనకే.. మాయలేవి చేయకే.. మౌనానివై మాట మానేయకే’ అంటూ సాగిన మెలోడీ సాంగ్‌‌‌‌లో గోపీచంద్, కావ్య థాపర్ స్టైలిష్ లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నారు.  చైతన్ భరద్వాజ్ పాటను కంపోజ్ చేయగా, వెంగీ క్యాచీ లిరిక్స్ రాశాడు. కపిల్ కపిలన్ పాడిన తీరు ఆకట్టుకుంది. దసరా కానుకగా  అక్టోబర్ 11న సినిమా విడుదలకానుంది.