![బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టైటిల్ రివీల్](https://static.v6velugu.com/uploads/2024/01/makers-released-bellamkonda-srinivas-new-movie-title_uq7ermNFpE.jpg)
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సంద ర్భంగా బుధవారం ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి ‘టైసన్ నాయుడు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ అభిమానిగా హీరోను పరిచ యం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంది.
ఇందు లో శ్రీనివాస్ డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా ఫెరోషియస్‌గా కనిపించాడు. వెనుక మైక్ టైసన్ మెరుస్తున్న పోస్టర్ కనిపిస్తుండగా.. అతను బాక్సింగ్ రింగ్‌లోకి దిగిన సీన్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో విజువల్స్‌ను మరింతగా ఎలివేట్ చేశాడు. ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్‌తో సినిమాపై ఆసక్తి కలిగించారు. మేకర్స్. హీరో సాయి శ్రీనివాస్ కెరీర్‌లో ఇది 10వ చిత్రం.