గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమా’. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గోపీచంద్ లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం టీజర్‌ను రిలీజ్ చేశారు. భగవద్గీత శ్లోకంతో మొదలైన టీజర్‌లో రాక్షసులు, దుష్ట శక్తులు కనిపిస్తున్నాయి.
‘ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా’ అని బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వినిపించడం, ఆ తర్వాత ఎద్దుపై కూర్చొని మ్యాసివ్, వైల్డ్ లుక్‌లో గోపీచంద్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో ఎంట్రీ ఇవ్వడం ఇంప్రెస్ చేసింది. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఈ సీన్‌ను మరింత ఎలివేట్ చేసింది. అలాగే టీజర్‌తో పాటు మూవీ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అజ్జు మహంకాళి డైలాగ్స్ రాస్తున్నాడు.