గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ రిలీజ్

గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ రిలీజ్

హీరో నుంచి తిరిగి క్యారెక్టర్‌‌ ఆర్టిస్ట్‌‌గా మారిన సునీల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఒకటి. అంజలి లీడ్ రోల్‌‌ చేస్తున్న ఈ చిత్రంలో సునీల్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. శుక్రవారం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌తో తన క్యారెక్టర్‌‌‌‌ను పరిచయం చేశారు. ఇందులో సునీల్ ‘కిల్లర్ నాని’గా కనిపించనున్నాడని రివీల్ చేశారు. అలాగే పోస్టర్‌‌‌‌లో శరీరంపై గాయాలతో, చేతిలో హాకీ బ్యాట్‌‌తో కనిపిస్తున్నాడు. 

బ్యాక్‌‌గ్రౌండ్‌‌లో పాడుబడిన బిల్డింగ్ ఉంది. మరి సునీల్ ఎవరి చేతిలోనైనా దెబ్బలు తిన్నాడా, తనే ఎవర్నైనా కొట్టాడా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.  ‘గీతాంజలి’కి సీక్వెల్‌‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి   కథ, స్ర్కీన్‌‌ప్లే అందిస్తూ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్.  శివ తుర్లపాటి దర్శకుడు.  ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌‌న్‌‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.  శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్ ఇతర  పాత్రలు పోషిస్తున్నారు. భాను భోగ‌‌వ‌‌ర‌‌పు, నందు శ‌‌వ‌‌రిగ‌‌ణ‌‌ మాటలు రాస్తున్నారు.   ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు.