లాల్ సలామ్‌‌‌‌ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ విడుదల

ర‌‌‌‌జినీకాంత్‌‌‌‌, విష్ణు విశాల్‌‌‌‌, విక్రాంత్ లీడ్ రోల్స్‌‌‌‌లో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సలామ్‌‌‌‌’. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించగా, లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్‌‌‌‌ విడుదల చేస్తోంది. ఈనెల 9న సినిమా విడుదలవుతుండగా, బుధవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. విలేజ్ పాలిటిక్స్, క్రికెట్, మత ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా ఇదని ట్రైలర్‌‌‌‌‌‌‌‌లో చూపించారు.

‘బిడ్డ సంపాదిస్తే ఇంటికి గౌరవం.. ఆ బిడ్డ సాధిస్తే దేశానికే  గౌరవం, మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో’ లాంటి డైలాగ్స్‌‌‌‌ ఆకట్టుకున్నాయి. మొయినుద్దీన్ భాయ్ అనే పాత్రలో రజినీకాంత్ కనిపించారు. జీవితా రాజశేఖర్, క‌‌‌‌పిల్ దేవ్‌‌‌‌, సెంథిల్, తంబి రామ‌‌‌‌య్య, అనంతిక‌‌‌‌, వివేక్ ప్రసన్న, తంగదురై ఇతర పాత్రలు పోషించారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.