శివ కంఠమనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో కె.ఎస్.శంకర్ రావ్, జి.రాంబాబు యాదవ్, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. స్ట్రిక్ట్‌గా ఉండే ప్రొఫెసర్‌కు కాలేజీలో మంచి పేరు ఉన్నా.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి. సిన్సియర్‌గా ఉండటం వలన హీరో ఎలాంటి చిక్కుల్లో పడతాడు. వాటిని ఎలా అధిగమిస్తాడనేది కథ.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మురళీ మోహన్ సినిమా విజయం సాధించి టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరారు. ‘కంప్లీట్ కమర్షియల్ సినిమా ఇది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని అన్నాడు శివ కంఠమనేని. ఈ కార్యక్రమంలో అజయ్ ఘోష్, అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.