బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ డంకీ(Dunki). బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ(Rajkumar Hirani) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తాప్సి(Tapsi) హీరోయిన్ గా నటిస్తుండగా.. బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీ రోల్స్ చేస్తున్నారు. డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజైన టీజర్, సాంగ్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి.
ఇదిలా ఉంటే.. షారుఖ్ ఖాన్ డంకీ మూవీ గురించి ఓక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం మేకర్స్ కేవలం రూ.80 కోట్లు మాత్రమే ఖర్చు చేశారట. ఈ వార్త తెలుసుకున్న ఇండస్ట్రీ వర్గాలు షాకవుతున్నారు. మాములుగా షారుఖ్ సినిమా అంటేనే దాదాపు రూ.150 నుండి రూ.200 కోట్ల బడ్జెట్ అవుతుంది. అలాంటిది షారుఖ్ అండ్ రాజ్ కుమార్ హిరానికి కాంబోలో వస్తున్న ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీకి కేవలం రూ.80 కోట్లు మాత్రమే ఖర్చు చేశారా? అంటూ షాకవుతున్నారు.
ఈ వార్త గనక నిజమైతే.. డంకీ మూవీకి ప్రాఫిట్స్ నెక్స్ట్ లెవల్లో వస్తాయని అర్థమవుతోంది. షారుఖ్ గత రెండు సినిమాలు పఠాన్, జవాన్ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. దీంతో డంకీ సినిమా కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే డంకీ మూవీకి రికార్డ్ కలెక్షన్స్ కాదు రికార్డ్ ప్రాఫిట్స్ రాబట్టే అవకాశం ఉంది.
Also Read :- కన్నప్ప నుండి సాలిడ్ అప్డేట్.. చూస్తుంటే కెరీర్ బెస్ట్ అయ్యేలా ఉంది