పొద్దున 7 గంటలకు టిఫిన్.. మధ్యాహ్నం 3 గంటలకు భోజనం

పొద్దున 7 గంటలకు టిఫిన్.. మధ్యాహ్నం 3 గంటలకు భోజనం

కౌడిపల్లి, వెలుగు: ఉదయం 7 గంటలకు టిఫిన్(ఇడ్లీ) పెట్టి.. మధ్యాహ్నం 3 గంటలైనా భోజనం పెట్టకపోవడంతో సోమవారం మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల స్టూడెంట్లు ఆకలితో అలమటించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వచ్చి నిర్వాహకులను ప్రశ్నించడంతో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉడికీ.. ఉడకని అన్నం, నీళ్ల చారుతో భోజనం పెట్టారు. 

ఏ రోజూ మెనూ ప్రకారం తిండి పెట్టడం లేదని, డైలీ పొద్దున పూట ఇడ్లీనే పెడుతున్నారని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం సరిగా ఉడకడం లేదని వాపోయారు. కడుపునొప్పి, విరేచనాలతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఈ విషయమై ప్రిన్సిపల్ శివప్రసాద్​రెడ్డి వివరణ కోరగా.. క్యాటరింగ్ వాళ్లు వంట వాళ్లకి జీతం ఇవ్వకపోవడంతో వంట తయారీలో  ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవమేనని తెలిపారు. 

ALSO READ:తెలంగాణ భవిష్యత్తుపై .. లాల్ దర్వాజ భవిష్యవాణిలో మాతంగి అనురాధ

స్టూడెంట్లకు టైంకు భోజనం పెట్టడం లేదని తెలిసి, ఇప్పటికే నోటీసులు ఇచ్చామన్నారు. ఈ విషయాన్ని ఆర్ సీఓ, ఎంజేపీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.