సింగరేణి ప్రైవేటీకరణను కాంగ్రెస్సే ఆపింది: మక్కాన్ సింగ్ 

సింగరేణి ప్రైవేటీకరణను కాంగ్రెస్సే ఆపింది: మక్కాన్ సింగ్ 
  • ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 

హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ కాకుండా ఇప్పటి వరకు ఆపిందే కాంగ్రెస్ పార్టీ అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి సింగరేణిని తీర్చిదిద్దారని, ప్రస్తుతం సంస్థ ప్రైవేటీకరణపై మాట్లాడడానికి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సిగ్గుండాలని మండిపడ్డారు.

బీజేపీతో కలిసి సింగరేణి ప్రైవేటీకరణకు సహకరించిందే బీఆర్ఎస్ పార్టీ అని ఆయన ఆరోపించారు. గనుల వేలం పాటకు మద్దతుగా పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్పటి బీఆర్ఎస్ ఎంపీలు వినోద్ రావు, కవిత, బాల్క సుమన్, నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని బొగ్గు గనులన్నీ సింగరేణికి చెందాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు. సింగరేణిని కాపాడుకోవాలన్న పట్టుదల తమ ప్రభుత్వానికి ఉందన్నారు.

గతంలో ఇతర రాష్ట్రాల్లో బిడ్డింగ్ వేయడానికి సింగరేణికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలో చేరడంతో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలు ఆయన ఇంటి వద్ద ఆందోళన చేయడం అర్థరహితమన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఫిరాయింపుల గురించి ఆ పార్టీ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదన్న నమ్మకంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.