కొత్త పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి : మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

గోదావరిఖని, వెలుగు:  కొత్త పరిశ్రమల స్థాపనతో రామగుండం ప్రాంతవాసులకు ఉపాధి లభిస్తుందని, ఆ దిశగా తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు. మంగళవారం గోదావరిఖనిలోని క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఎన్టీపీసీ ద్వారా 800 మెగావాట్ల సామర్థ్యం గల 3 ప్రాజెక్టులతోపాటు రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో మరో ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.

ఈ ప్రాజెక్టులను కచ్చితంగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా విరాజిల్లాల్సిన రామగుండం.. గత ప్రభుత్వ హయాంలో బొందల గడ్డగా మారిందని ఆరోపించారు. గోదావరి నది కలుషితం కాకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరిఖని, గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ లీడర్లు బొంతల రాజేశ్‌‌‌‌‌‌‌‌, కాల్వ లింగస్వామి, తేజస్విని ప్రకాశ్‌‌‌‌‌‌‌‌, తిప్పారపు శ్రీనివాస్, మారెల్లి రాజిరెడ్డి, పెండ్యాల మహేశ్‌‌‌‌‌‌‌‌, ఓదెలు పాల్గొన్నారు.