మాకూ మంత్రి పదవి ఇవ్వాల్సిందే ..లేకుంటే ప్రజాపాలన ఎలా అవుతది.?: మల్ రెడ్డి రంగారెడ్డి

మాకూ మంత్రి పదవి ఇవ్వాల్సిందే ..లేకుంటే ప్రజాపాలన ఎలా అవుతది.?: మల్ రెడ్డి రంగారెడ్డి

 మంత్రివర్గంలో ఉమ్మడి పది జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనని మహేశ్వరం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. రాష్ట్ర జనాభాలో 44శాతం జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. 

'గతంలో నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాను. 44శాతం జనాభా కలిగిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు రాకపోతే ప్రజాపాలన అని ఎలా చెప్పగలం. మా జిల్లాకు మంత్రి పదవి వచ్చేందుకు రిజర్వేషన్ అడ్డయితే, నేను ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేస్తాను. పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా గెలిపించుకుంటాం. మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిథ్యం లేని జిల్లాలకు అవకాశం ఇవ్వాలి' అన్నారు.

ALSO READ | అపాయింట్మెంట్ కోసం ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ