‘మాలల సింహగర్జన’కు తరలిరండి : బేర బాలకిషన్

  • మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేర బాలకిషన్ పిలుపు

ఎల్బీనగర్, వెలుగు : సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరేడ్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జన సభనువిజయవంతం చేయాలని తెలంగాణ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేర బాలకిషన్ పిలుపునిచ్చారు. శుక్రవారం సరూర్ నగర్ మండల కార్యాలయం వద్ద మాలల సింహగర్జన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ‘బ్యాగరి.. కాటి కాపరుల సంఘం’ నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, రేవంత్ రెడ్డి సీఎం కావడానికి రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది మాలలు కష్టపడ్డ విషయాన్ని సీఎం మర్చిపోకూడదన్నారు. 

గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మాదిగలందరూ ఓటు వేయాలని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఉన్న 9 మంది మాల ఎమ్మెల్యేలు వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏ మాత్రం దళితుల మీద ప్రేమ ఉన్నా.. ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచాలని కోరారు. మాలలకు ప్రత్యేకంగా మాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలన్నారు. 

ఇందిరా గాంధీ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రాష్ట్రంలో మాలలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. ఏకపక్షంగా ఎస్సీ వర్గీకరణ చేస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి సింహగర్జనకు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మాల బ్యాగరి కాటికాపర్ల సంఘం జనరల్ సెక్రటరీ పద్మాకర్, సంఘం నాయకులు పాల్గొన్నారు.