
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణకు నిరసనగా గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాలలు ఆందోళన చేపట్టారు. ఐబీ చౌరస్తాలోని డాక్టర్బీఆర్అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మాల, మాదిగలను విభజించి పబ్బం గడుపుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ తీసుకువచ్చాయని మండిపడ్డారు.
ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాల్లో ఎక్కడ వర్గీకరణ చేయలేదని, కేవలం సీఎం రేవంత్రెడ్డి సర్కార్ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని, లేదంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు.
ఇటీవల జరిగిన కులగణన కూడా తప్పుల తడకేనన్నారు. కార్యక్రమంలో మాల సంఘం జిల్లా ప్రెసిడెంట్లు గజెల్లి లక్ష్మణ్, కుంబాల రాజేశ్, రాష్ట్ర అధికార ప్రతినిధి భూపెల్లి మల్లయ్య, సెక్రటరీ మాలెం చిన్నయ్య, ఎ.మధు, జిల్లా సెక్రటరీలు బి.తిరుపతి, బి.సమ్మయ్య, ఎం.గోపి, పి.చంద్రశేఖర్, బి.సంజీవ్, జె.సురేశ్ తదితరులు పాల్గొన్నారు.