![కాకా కుటుంబాన్ని విమర్శిస్తే ఊరుకోం : శీలం వెంకటేష్](https://static.v6velugu.com/uploads/2025/02/mala-mahanadu-leader-seelam-venkatesh-warns-against-criticism-of-former-union-minister-kakas-family_kEnSuaGirK.jpg)
- మాల మహానాడు చెన్నూర్ ఇన్చార్జీ శీలం వెంకటేష్
జైపూర్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కాకా కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదని మాల మహానాడు చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జీ శీలం వెంకటేష్ హెచ్చరించారు. మాజీ ఎంపీ వెంకటేష్ నేత వ్యాఖ్యలపై జైపూర్లో శనివారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ ఉప కులాల వర్గీకరణ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జరిగిందన్నారు.
దీనిని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా మాజీ మాజీ ఎంపీ వెంకటేష్ రాజకీయం చేయడం తగదన్నారు. నేతకాని సమాజం అభివృద్ధికి ఆయన చేసిన పనేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు పత్తి సురేశ్, సతుకు పోషం, బొల్లంపల్లి శేఖర్ పాల్గొన్నారు.