
పంజగుట్ట, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం వేసిన ఆరుగురు సభ్యుల కమిటీ నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ మల్లు రవిని తొలగించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ప్రభుత్వాన్ని కోరారు. కమిటీ చైర్మన్‌గా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కో చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిని నియమించారు. ఈ నియామకంపై చెన్నయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం చెన్నయ్య మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ ఎస్సీ వర్గీకరణ కమిటీలో ఉంటే మాలలకు న్యాయం జరగదని అన్నారు. వారిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. వాళ్ల ప్లేస్‌లో ఎవరిని నియమించినా పర్వాలేదుకానీ, మల్లు రవిని, దామోదరను మాత్రం తొలగించాల్సిందేనని అన్నారు.