గోదావరిఖని, వెలుగు: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ త్వరలో హైదరాబాద్‌లో 2 వేల గొంతుకలు– 2 లక్షల గుత్పలతో ప్రదర్శన చేపట్టనున్నట్లు మాలమహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి తెలిపారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ దేశానికి దిశానిర్దేశాన్ని అందించిన రాజ్యాంగానికి కట్టుబడి మాలలు వ్యవహరిస్తున్నారన్నారు.
మాలలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని, ఇది తగదన్నారు. మాదిగలకు డప్పు వృత్తి అయితే, మాలలకు గుత్ప వృత్తి సాధనం అనేది మంద కృష్ణమాదిగ గుర్తు పెట్టుకోవాలన్నారు. త్వరలో బీజేపీ జిల్లా ఆఫీస్‌లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మీటింగ్‌లో రాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్, జిల్లా ప్రెసిడెంట్దేవీ లక్ష్మీనర్సయ్య, మగ్గిడి దీపక్, ఆరె దేవకర్ణ, కారెంగుల శ్రీశైల, బబిత, రాజకిశోర్, కందుల కుమార్, పాల్గొన్నారు.