హైదరాబాద్, వెలుగు: రాష్ట్రా వ్యాప్తంగా వచ్చే నెల 25 నుంచి మాలలు మహా పాదయాత్ర చేస్తున్నట్లు మాల మహానాడు స్టేట్ ప్రెసిడెంట్ పిల్లి సుధాకర్ వెల్లడించారు. ఈ యాత్రకు మాల మేధావులు, ఉద్యోగులు బాసటగా నిలవాలన్నారు.
బుధవారం హైదరాబాద్ లో జరిగిన మాల మహానాడు విస్తృత సమావేశంలో 33 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి సుధాకర్ మాట్లాడుతూ.. వర్గీకరణ పేరుతో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ న్యాయపోరాటానికి మాలలు సిద్ధం కావాలన్నారు. గ్రామ స్థాయిలో మాల మహానాడు సంఘాన్ని బలోపేతం చేయాలని సుధాకర్ పిలుపునిచ్చారు.