షమీమ్ అక్తర్ ​కమిషన్ ​నివేదిక తప్పుల తడక

షమీమ్ అక్తర్ ​కమిషన్ ​నివేదిక తప్పుల తడక

 

  • 2014 జనాభా ఆధారంగా వర్గీకరణ చేయాలి
  • మాలసంఘాల జేఏసీ చైర్మన్ ​జి.చెన్నయ్య 

ఖైరతాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి షమీమ్ అక్తర్​కమిషన్​ఇచ్చిన నివేదిక తప్పుల తడకని మాల సంఘాల జేఏసీ చైర్మన్​జి.చెన్నయ్య ఆరోపించారు. 2011 జనాభా ఆధారంగా వర్గీకరణ చేయొద్దని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 జనాభా లెక్కల ఆధారంగా నివేదికను తీసుకుని వర్గీకరణ చేయాలన్నారు. షమీమ్​అక్తర్​కమిషన్​నివేదిక ప్రకారం చేస్తే మాలలకు, మాల ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతుందని చెన్నయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మాల ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్​రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో పెట్టడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. సుమారు 2 లక్షల మంది మాల జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారని, జరగబోయే  అన్యాయంపైనే తమ పోరాటమన్నారు.

 మాల సంఘాల జేఏసీ వర్కింగ్​చైర్మన్​చెరుకు రామచందర్ మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్క ల ప్రకారం ఎస్సీ వర్గీకరణను బిల్లు చేయడం కరెక్ట్ కాదన్నారు. దీంతో 59 కులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై మాల సంఘాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయన్నారు. జేఏసీ నాయకులు కరణం కిషన్, మన్నె శ్రీధర్, సరళాదేవి, జంగా శ్రీనివాస్, సుధ మళ్ల అంజలి,​ గోపోజు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.