
- మాల యూత్ ఫెడరేషన్, మాల స్టూడెంట్ జేఏసీ నిరసన
ఓయూ, వెలుగు: బీఆర్ఎస్లోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మాలలకు 5% రిజర్వేషన్లు చాలు అనడాన్ని మాల యూత్ ఫెడరేషన్, మాల స్టూడెంట్ జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన తెలిపారు. మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్, మాల స్టూడెంట్స్ జేఏసీ ప్రెసిడెంట్ మాదాసు రాహుల్ మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ నాయకుల మాటలను బలపరుస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో నామ సైదులు, మద్దెల రాజు, సింగి శ్రీకాంత్, సంఖ్య శివ కుమార్, సుధాకర్, గంగారాం, రఘు తదితరులు పాల్గొన్నారు.