రోస్టర్ విధానంతో మాలలకు తీవ్ర అన్యాయం : మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్

రోస్టర్ విధానంతో మాలలకు తీవ్ర అన్యాయం : మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్

ఓయూ, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ పాయింట్ విధానంతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ ఆరోపించారు. బుధవారం ఓయూలో తెలంగాణ మాల స్టూడెంట్ జేఏసీ, మాల యూత్ ఫెడరేషన్, ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను, అందులోనిరోస్టర్ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

క్యాబినెట్​మీటింగ్​లో ఈ రెండు అంశాలపై పున: సమీక్ష జరపాలన్నారు. మాల, మాల అనుబంధ కులాలకు నష్టం జరగకుండా సవరణలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో మాల స్టూడెంట్ జేఏసీ అధ్యక్షుడు మాదాసు రాహుల్, అంసా ఓయూ అధ్యక్షుడు నామ సైదులు, పసరుగొండ కిషోర్, కొప్పుల అర్జున్, సింగి శ్రీకాంత్, ప్రవీణ్ కాంబ్లె, రవి, అంజిబాబు, గణేష్, శివకుమార్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.