హైదరాబాద్, వెలుగు : మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈ నెల 14 నుంచి 22 మధ్య ‘ఆర్టిస్ట్రీ షో’ ని నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని తన సోమాజిగూడ షోరూమ్‌లో నగలను ప్రదర్శనకు ఉంచనుంది. ట్రెడిషనల్, మోడర్న్ రెండు రకాల నగలను ప్రదర్శనకు ఉంచుతామని మలబార్ గోల్డ్ ప్రకటించింది.
ఆర్టిస్ట్రీ షోని తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ అలేక్య పుంజలా ప్రారంభిస్తారని తెలిపింది. ప్రదర్శన టైమ్‌లో కస్టమర్లు డైమండ్స్ వాల్యూలో 25 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చని, పాత మైన్ డైమండ్స్ ఎక్స్చేంజ్‌పై 100 శాతం పొందొచ్చని పేర్కొంది.