హైదరాబాద్‌‌లో మరో మలబార్‌‌‌‌ షోరూమ్‌‌ ఓపెన్‌‌

హైదరాబాద్‌‌లో మరో మలబార్‌‌‌‌ షోరూమ్‌‌ ఓపెన్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: మలబార్ గోల్డ్ అండ్  డైమండ్స్  హైదరాబాద్‌‌లోని టోలిచౌకి వద్ద  తమ కొత్త షోరూమ్‌‌ను ప్రారంభించింది. కంపెనీ  దేశ వ్యాప్తంగా స్టోర్లను ఏర్పా టు చేస్తోంది. 

ఇందులో భాగంగా హైదరాబాద్‌‌లో 15వ షోరూమ్‌‌ను తాజాగా ఓపెన్ చేసింది. ఈ కొత్త షోరూమ్‌‌ 10,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. జూబ్లీహిల్స్‌‌ ఎంఎల్‌‌ఏ మాగం టి గోపీనాథ్, కార్వాన్ ఎంఎల్‌‌ఏ కౌసర్ మొహియుద్దీన్, షేక్ పేట్ కార్పొరేటర్ మొహమ్మద్‌‌ రషీద ఫరాజుద్దీన్,   తదితరులు స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

 సాంప్రదాయ ఆభరణాలు, మోడర్న్‌‌ నగలు ఈ కొత్త షోరూమ్‌‌లో దొరుకుతాయని ఈ సందర్భంగా  మలాబార్ గ్రూప్ చైర్మన్‌‌ ఎంపీ అహ్మద్‌‌  పేర్కొన్నారు.  ఈ నెల  18 నుంచి  31 వరకు ప్రత్యేక  వెండి ఆఫర్‌‌‌‌ను కంపెనీ ప్రకటించింది.  ప్రతీ కొనుగోలుపై కస్టమర్లకు ఒక వెండి నాణెన్ని (కొన్న బంగారంతో సమానమైనది)  ఇస్తోంది.