హైదరాబాద్, వెలుగు: మలబార్ గ్రూప్ తన సీఎస్ఆర్ ప్రోగ్రామ్ ‘హంగర్–ఫ్రీ వరల్డ్’ ను మరిన్ని సిటీలకు విస్తరించింది. ఇప్పటి వరకు రోజుకి 31 వేల ఫుడ్ ప్యాకెట్లను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కంపెనీ, ఈ నెంబర్ను 51 వేలకు పెంచింది.
ప్రస్తుతం ‘హంగర్– ఫ్రీ వరల్డ్’ ప్రోగ్రామ్ దేశంలోని 37 సిటీల్లో అమలు చేస్తున్నామని మలబార్ గ్రూప్ తెలిపింది. విస్తరణలో భాగంగా 16 రాష్ట్రాల్లోని 70 సిటీల్లో ఈ ప్రోగ్రామ్ను అమలు చేస్తామని వివరించింది. అంతేకాకుండా జాంబియాలోని స్కూల్ పిల్లలకు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఫుడ్ ప్యాకెట్లను అందిస్తామని తెలిపింది.