హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత విద్యాసంవత్సరంలో తెలంగాణలోని 116 కాలేజీల్లో చదివే 3,900 మంది విద్యార్థినులకు స్కాలర్షిప్స్ ఇస్తామని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రకటించింది. ఇందుకోసం రూ.3.14 కోట్లు కేటాయిస్తారు. హైదరాబాద్లోని ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్లో శనివారం జరిగిన కార్యక్రమంలో కంపెనీ ఈ విషయాన్ని తెలియజేసింది.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా స్కాలర్షిప్స్ఇస్తున్నామని పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి అనసూయ సీతక్క ప్రారంభించారు.