మలైకా కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ రూమర్లు వైరల్.. అదేం లేదంటూ క్లారిటీ..

మలైకా కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ రూమర్లు వైరల్.. అదేం లేదంటూ క్లారిటీ..

బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ మలైకా అరోరా గతంలో స్టార్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పలు వార్తలు బలంగా వినిపించాయి. అయితే అర్జున్ కపూర్, మలైకా అరోరా కూడా పలుమార్లు బహిరంగంగా విలేఖర్ల కంటపడ్డారు. దీంతో ఈ వార్తలు నిజమేనని అందరూ అనుకున్నారు. ఇంతలోనే ఏమైందో ఏమోగానీ గత కొన్ని రోజుకాలుగా మలైకా అరోరా మరియు అర్జున్ కపూర్ మధ్య విభేదాలు పెరిగాయని అందుకే బ్రేకప్ జరిగిందని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ మధ్య మళ్ళీ మలైకా గురించి పలు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇందులో మలైకా ప్రస్తుతం ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ రాహుల్ విజయ్‌తో ప్రేమలో పడిందని, డేటింగ్ కూడా చేస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే మలైకా అరోరా రాహుల్ విజయ్ తో కలసి  ఏపీ ధిల్లాన్ మ్యూజిక్ కన్సర్ట్ కి వెళ్ళింది. దీంతో ఈ వార్తలు మరింత బలమయ్యాయి. ఈ ప్రేమ, పెళ్లి వార్తలపై నటి మలైకా అరోరా సన్నహిత బంధువులు స్పందించారు. 

ALSO READ | Bigg Boss: ఫైనల్ సమరంలో ట్విస్ట్.. ఓటింగ్లో నరాలు తెగే ఉత్కంఠ.. రెండో రోజు ఊహించని ఫలితాలు

ఇందులోభాగంగా ప్రస్తుతం మలైకా అరోరా ఎవరితోనూ, ఎలాంటి రిలేషన్ షిప్ లో లేదని తెలిపారు. అలాగే రాహుల్ విజయ్ కేవలం మలైకా తనయుడు అర్హాన్ ఖాన్ ఫ్యాషన్ స్టైలిస్ట్ అని స్పష్టం చేశారు. అలాగే రాహుల్ విజయ్ తో కలసి మ్యూజిక్ కన్సర్ట్ కి వెళ్లినంత మాత్రాన ఇద్దరిమధ్య ఎదో ఉందంటూ  తప్పుడు కథనాలు ప్రచారం చెయ్యడం సరికాదని పేర్కొన్నారు. దీంతో రాహుల్ విజయ్ తో ప్రేమాయణంపై వినిపిస్తున్న వార్తలపై దాదాపుగా పులిస్టాప్ పడిందని చెప్పవచ్చు.

ఈ విషయం ఇలా ఉండగా మలైకా అరోరా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అనే పాటలో నటించింది. ఈ పాట టాలీవుడ్ ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఈ పాటలో నటించిన తర్వాత మళ్ళీ మలైకా తెలుగు సినిమాలలో నటించలేదు.