బాలీవుడ్ నటి, సల్మాన్ ఖాన్ ఇంటి మాజీ కోడలు అయిన మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. 2024, సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం.. అనిల్ అరోరా తాను నివాసం ఉంటున్న బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్లి.. అక్కడి నుంచి కింద దూకి చనిపోయారు. ముంబై సిటీలోని బాంద్రాలో ఆయన నివాసం ఉంటున్నారు. అనిల్ అరోరా.. మలైకా అరోరా తండ్రి.. మలైకా అరోరా ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ మాజీ భార్య.
అనిల్ అరోరా కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ట్రీట్ మెంట్ జరుగుతున్నట్లు కూడా సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే మలైకా అరోరా ఇతర కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చారు. పోలీసులు సైతం స్పాట్ కు చేరుకుని విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. అనారోగ్యం వల్లే ఆత్మహత్య చేసుకున్నారా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలపై దృష్టి పెట్టారు పోలీసులు.
#JUSTIN : Arbaaz Khan reached at malaika's mother house after demise of Malaika's Father#MalaikaArora #AnilArora #Suicide #ArbaazKhan pic.twitter.com/1jKxiXT9Sy
— upuknews (@upuknews1) September 11, 2024