రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్

మలక్‌పేట్-II సర్కిల్‌కు చెందిన అసిస్టెంట్ కమిషనర్(స్టేట్ ట్యాక్స్) మహబూబ్ బాషా ఏసీబీ వలకు చిక్కాడు. ఫిర్యాదుదారు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనరైన మహబూబ్ బాషా.. ఫిర్యాదుదారుని బ్యాంక్ ఖాతాను డిఫ్రీజ్ చేయడానికి అవసరమైన లెటర్ ఇవ్వడానికి లక్ష రూపాయలు లంచం అడిగారు. అందులో భాగంగా 50 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఏ1 మహబూబ్ బాషాతో పాటు ఏ2 అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సోమ శేఖర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.. ఏసీబీ అధికారులు.

Also Read :- గచ్చిబౌలిలో ఒరిగిన ఐదంస్తుల భవనం

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే, టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని ఏసీబీ అధికారులు ప్రజలను కోరారు. ఫిర్యాదు దారుని పేరు, వివరాలు రహస్యంగా ఉంచుతామని తెలిపారు.