మాలలకు అన్యాయం చేయొద్దు: రాష్ట్ర మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు బేర బాలకిషన్

మాలలకు అన్యాయం చేయొద్దు: రాష్ట్ర మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు బేర బాలకిషన్

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు వచ్చే విధంగా కృషి చేస్తూనే.. మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని రాష్ట్ర మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేర బాలకిషన్ కోరారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన అద్దంకి దయాకర్ ను సోమవారం సిటీలోని ఇంట్లో మర్యాద పూర్వకంగా కలిశారు. మాలల స్థితిగతులపై చర్చించారు. 

అనంతరం బేర బాలకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణలోని 50 లక్షల మంది మాలల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఎస్సీలకు ఇచ్చిన హామీని అమలు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మాల సంఘాల నాయకులు శివకుమార్, దార సత్యం తదితరులు పాల్గొన్నారు.