సికింద్రాబాద్: అశేష జన సందోహం మధ్య సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మాలల సింహ గర్జన సభ మొదలైంది. ఖమ్మం నుంచి వచ్చిన డాక్టర్ గోపినాథ్ సభలో మాట్లాడుతూ.. సభ కోసం అదానీ, అంబానీ డబ్బులు ఇవ్వలేదని, సొంత ఖర్చులు పెట్టుకుని అంతా తరలివచ్చారని చెప్పారు. సభను బలోపేతం చేసింది వివేక్ వెంకట స్వామి, నాగరాజు అని ఆయన కొనియాడారు.
ఎయిడ్స్ కంటే భయానకం అయిన కులవివక్షపై పోరాటం చేసింది మాలలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు ఆశాస్త్రీయం, న్యాయసూత్రాలకు విరుద్ధం అని అభిప్రాయపడ్డారు. దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, క్యాస్ట్ ఫెడరేషన్ వైపు కలిసి అడుగులు వేద్దామని డాక్టర్ గోపీనాథ్ పిలుపునిచ్చారు.