సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ‘మాలల సింహ గర్జన’ సభ.. లైవ్ అప్డేట్స్..

ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ప్రసంగంలోని ప్రధానాంశాలు
* జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అని రాహుల్ గాంధీ అంటున్నారు
* మాలలకు రిజర్వేషన్లు 20 శాతం చెయ్యాలి.. జనాభా ప్రకారం రిజర్వేషన్లు చెయ్యాలి
* దేశంలో కులవివక్ష ఏండ్ల సంది నడుస్తోంది.. చదువుల్లో, నిధుల్లో సమాన అవకాశాలు కల్పించలేదు
* బాబా సాహెబ్ అంబేద్కర్ దళితులకు ఫ్రీడమ్ కోసం పాటు పడ్డారు.
* కుల వివక్షకు గురవుతున్నవారంతా హోమోజినియస్ అని ఆర్టికల్ 341 చెబుతోంది
* క్రిమిలేయర్ తీసుకురావాలని చూస్తున్నారు.. ముందుముందు రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉంది 
* మాలలకు వ్యతిరేకంగా మాట్లాడే రాజకీయ పార్టీలకు, నాయకులకు ఈ సభ హెచ్చరిక
* కాకా వెంకట స్వామి ఎక్కడా కులం అడిగి విద్యను అందించలేదు, గుడిసెల పోరాటం చేసి కులం పేరుతో  ఇండ్లు ఇవ్వలేదు
* మన బలం మన కష్టంతో మాలలుగా పేరు సంపాదించుకున్నాం
* పేదల కోసం కష్టపడిన వ్యక్తి బాబా సాహెబ్ 
* అంబేద్కర్ను విమర్శిస్తే ఇక మాలలు ఊరుకోరు.. ఖబర్దార్
* రాజకీయ పార్టీల్లో మాలల పట్ల చిన్నచూపు ఉంది
* అలాంటి రాజకీయ పార్టీలకు చెంపపెట్టు మన ఈ మాల సభ
* మంత్రి పదవి కోసం మాలల పోరాటం అంటున్నారు
* నేను తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని.. పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదు
* కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. ఎన్నో పదవులు ఇస్తాం అంటూ ఆఫర్స్ వచ్చాయి.. తృణప్రాయంగా విడిచి పెట్టాను
* ED దాడులు చేసినా వెనక్కి తగ్గలేదు.. మీ అందరికీ మేము అండగా ఉన్నాం

‘మాలల సింహ గర్జన’లో పాశ్వాన్ స్పీచ్ హైలైట్స్
* సుప్రీంకోర్టు నిర్ణయంపై మాలలు ఉద్యమిస్తారని తేలిపోయింది
* పార్లమెంట్లో మాలల గురించి చర్చ జరగాలి
* బహుజన దళితుల కోసం పోరాటం చేస్తున్నాం
* తెలంగాణ, ఏపీ కాదు ఢిల్లీలో చర్చ జరగాలి
* ఢిల్లీ వరకూ మాలల పోరాటం చేరితే మోదీ కుర్చీ కదలాలి
* పరేడ్ మైదానం కాదు రోడ్డుపై నిల్చొని మాలలు సభను సక్సెస్ చేశారు
* మాలలు ఏకం కావడంతో మైదానం సరిపోలేదు
* దేశంలోనే మొదటి సారిగా ఇంత మంది మాలలు ఒకే చోట చేరారు
* సికింద్రాబాద్ మైదానానికి తరలి వచ్చినట్టే ఢిల్లీకి రావాలి.. మేం అండగా ఉంటాం
* మా హక్కులను కాలరాసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది
* మాలలు ఆత్మ బలిదానం కోసం అయినా సిద్ధంగా ఉండే వ్యక్తులు

‘మాలల సింహ గర్జన’లో రేంజర్ల రాజేశ్ వ్యాఖ్యలు

* మనువాదుల బూట్లు నాకే కుక్కలు ఉన్నారు

* మీలా 30 ఏండ్లు పోరాడితే.. ఈ దేశాన్నే ఏలుతాం

* ఈ దేశంలో మాలలను కదిలించే శక్తి మాకుంది

‘మాలల సింహ గర్జన’ సభలో విశ్లేషకులు దిగంబర్
* MRPS తిండిబోతుల ముఠా.. మాలలు తిన్నారు అంటారు.. ఏం ఉంది తినడానికి ?
* తిండిబోతుల, దొంగల ముఠా మాలలను అవమానిస్తోంది
* మాలలను నిర్వీర్యం చేసింది MRPS దొంగలు
* రాజ్యాంగం ఇచ్చిన హక్కులనే మేము వాడుకుంటున్నాం
* ఉద్దేశపూర్వకంగా మాలలను ఇబ్బంది పెడితే ఇక ఊరుకోము
* 30 ఏండ్లు ఓపిక, సహనంతో ఉన్నాం.. సభ ఎవరికీ విరుద్ధం కాదు
* SC వర్గీకరణ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొదటగా చేపట్టి తరువాత తెలంగాణలో చేయండి
* ఈ పోరాటం మొదలు మాత్రమే.. ఇంక ముందు ఇంకా ఉంటాయి.

‘మాలల సింహ గర్జన’ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ రావు వ్యాఖ్యలు
* హరిజనులు, గిరిజనుల గురించి కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్
* మాలల ఆత్మ గౌరవం కోసమే మాలల సింహగర్జన సభ
* SC వర్గీకరణకు వ్యతిరేకంగా వివేక్ ఎన్నడూ మాట్లాడలేదు
* సుప్రీంకోర్టు తీర్పుతో 30 లక్షల మంది మాలలు నష్టపోతున్నరు
* SC వర్గీకరణను మేము అడ్డుకోవడం లేదు
* అందరికీ సమాన న్యాయం జరగాలి

మాల రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు రామ్ చందర్ స్పీచ్
* మాలలు లేరు అన్న మనువాదులకు, అగ్ర కులం వారికి చెంప చెల్లుమనేలా సభకు తరలివచ్చారు
* రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేయాలి
* విద్యలో మాలలు వెనకపడి ఉన్నారు
* అగ్ర కుల రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలి
* దామాషా ప్రకారం రిజర్వేషన్ల కొసం రాబోయే రోజుల్లో పోరాటం చెయ్యాలి

డాక్టర్ గోపీనాథ్ వ్యాఖ్యలు
* సభ కోసం అదానీ, అంబానీ డబ్బులు ఇవ్వలేదు
* సొంత ఖర్చులు పెట్టుకుని అంతా తరలివచ్చారు
* సభను బలోపేతం చేసింది వివేక్ వెంకట స్వామి, నాగరాజు
* ఎయిడ్స్ కంటే భయానకం అయిన కులవివక్ష పై పోరాటం చేసింది మాలలు
* సుప్రీం కోర్టు తీర్పు ఆశాస్త్రీయం, న్యాయ సూత్రాలకు విరుద్ధం
* దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది
* క్యాస్ట్ ఫెడరేషన్ వైపు కలసి అడుగులు వేద్దాం

‘మాలల సింహగర్జన’ సభలో మాట్లాడుతున్న మల్లు రవి
* అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, చదువులో అవకాశం ఇచ్చి వెళ్లిన గొప్ప వ్యక్తి
* మాల, మాదిగ కులాల మధ్య విభేదాలు రాకుండా ఉండాలనే ఈ సమావేశం
* అందరూ కలిసికట్టుగా ఉండాలి.. రిజర్వేషన్లు ప్రభుత్వ సెక్టారే కాదు ప్రైవేట్ సెక్టార్లోనూ రిజర్వేషన్లు ఉండాలి
* ఇండ్లు కట్టేది, రోడ్లు కట్టేది మనం.. అనుభవిస్తున్న వారు ఇతరులు ఉంటున్నారు
* మాలమాదిగలు సంయుక్త పోరాటం చెయ్యాలి
* సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల మాలమాదిగలు కలిసి పోరాటం చేయాలి

సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఆదివారం ‘మాలల సింహగర్జన’ సభ అశేష జనసందోహం మధ్య మొదలైంది. ఈ సభకు తెలంగాణ, ఏపీ నుంచి పెద్ద ఎత్తున మాలలు తరలివచ్చారు. మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఇది తమ హక్కుల కోసం నిర్వహిస్తున్న మీటింగ్ అని, అంతే తప్ప ఎవరికీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మాలల్లో ఐక్యత వచ్చిందని, ఇదే ఐక్యత రానున్న రోజుల్లోనూ కొనసాగించాలని వివేక్ వెంకటస్వామి కోరారు. రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారని, ఈ మీటింగ్ ద్వారా మాలల సత్తా చూపిస్తామని చెప్పారు.