సింహగర్జన సభకు మాలలు తరలిరావాలి : కాసర్ల యాదగిరి

సింహగర్జన సభకు మాలలు తరలిరావాలి : కాసర్ల యాదగిరి
  • జాతీయ ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి పిలుపు

బెల్లంపల్లి/కుంటాల, వెలుగు : ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1న సికింద్రాబాద్​లోని పరేడ్ గ్రౌండ్​లో జరిగే మాలల సింహగర్జన మహాసభకు తరలి రావాలని మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి పిలుపునిచ్చారు. గురువారం ఆయన బెల్లంపల్లిలోని ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. సభకు బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి చీఫ్​గెస్టులుగా హాజరు కానున్నట్లు చెప్పారు. 

మంచిర్యాలతోపాటు ఉమ్మడి జిల్లా నుంచి మాలలు పెద్ద సంఖ్యలో వచ్చి సభను సక్సెస్ చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర నాయకులు బద్దం వాసురాం, జిల్లా నాయకులు ఎర్కల నర్సింగ్, రామిళ్ల ప్రదీప్, జంజిరాల మనోహర్ పాల్గొన్నారు.

పోస్టర్ల ఆవిష్కరణ

మాలల సింహగర్జన సభను సక్సెస్ చేయాలని నిర్మల్ ​జిల్లా నేత మగ్గిడి దిగంబర్ పిలుపునిచ్చారు. సభ పోస్టర్లను గురువారం కుంటాల మండలంలోని పెంచికల్ పాడ్​లో ఆవిష్కరించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లోని మాలలు సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.