మాల జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మాల జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: రాష్ట్రంలో రెండో అతిపెద్ద కులం మాల అని.. మాలలు తక్కువగా ఉన్నారనేది అబద్ధమని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలకు గుర్తింపు రావాల్సి ఉందని.. దీనికోసమే జాగో మాల కార్యక్రమం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. వచ్చే నెల 1న పరేడ్ గ్రౌండ్‎లో నిర్వహించే మాలల సింహగర్జనకు సంబంధించిన వాల్ పోస్టర్‎ను 2024, నవంబర్ 14వ తేదీన హైదరాబాద్ సోమాజిగూడ్ ప్రెస్ క్లబ్‎లో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాలమహానాడు నేతలు రిలీజ్ ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణాలో 30 లక్షలమంది మాలలు ఉంటారని.. అన్ని పొలిటికల్ పార్టీలలో మాలలు ఉన్నారని అన్నారు. మాలలకు మంచి లీడర్ షిప్ క్వాలిటీ ఉందని.. ఇకపై మాలలు అందరు బయటికి రావాలని పిలుపునిచ్చారు. 50 వేల మందితో నాగర్ కర్నూల్‎లో సభ పెట్టి సక్సెస్ అయ్యామని.. 5 గంటల పాటు సభ జరిగితే అందరూ సహకరించారని చెప్పారు. 

ALSO READ | మాకేం తెలియదు.. మేం ఎవరిపై దాడి చేయలే: లగచర్ల గ్రామ ప్రజలు

మాలల గౌరవం కోసం నేను కార్యక్రమాలు చేస్తున్నానని.. ఇకపై మన బలం చూపించడానికి అందరం కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే వివేక్. ఇందులో భాగంగానే వచ్చే నెల (డిసెంబర్) 1న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‎లో మాలల సింహాగర్జన హైద్రాబాద్‎లో ఉందని.. ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మాలలు కదలిరావాలి.. మాలలంతా హాజరై ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరారు. మాల కులాన్ని జాతిని కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉందన్నారు. 

మాలల డిమాండ్లు ఇవే :

  •   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే నిలిపి వేయాలి.
  •    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014, జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పథకాల వారీగా లబ్ధిపొందిన (59) షెడ్యూల్డ్ కులాల వారీగా వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. 
  •  తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన ఎస్సీ జనాభా ప్రకారం 15 నుంచి 22 శాతానికి పెంచాలని డిమాండ్.
  •  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు కులాల వారీగా వెల్లడించాలి. 
  •  ఎస్సీ సంక్షేమ ఫలాలు, దళిత బందు లబ్దిదారుల జాబితాను కులాల వారీగా విడుదల చేయాలి. 
  •  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు గురుకుల, ఓవర్సీస్ విద్యా రంగాల్లో లబ్దిపొందిన మాల, మాదిగ ఉప కులాల వారీగా లెక్కలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. 
  •   దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ప్రక్రియ ఇంత వరకు ఎందుకు ప్రారంభించలేదో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. 
  •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేస్తూ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలి.