వెలుగు, సికింద్రాబాద్: హక్కుల సాధన కోసం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన మాలలసింహగర్జన సభ సక్సెస్ అయ్యింది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో మాలలు సభకు తరలిరావడంతో జనసంద్రాన్ని తలపించింది. సభ మొదలైన కొద్దిసేపటికి ఒక్కసారిగా వర్షం పడగా, ప్రజలు కుర్చీలు తలపై పెట్టుకుని నాయకుల ప్రసంగాలు విన్నారు. కళాకారులు స్టేజీపై ఆటపాటలతో హుషారెత్తించారు.
మాలలు ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నరు: వికారాబాద్ మాల మహానాడు అధ్యక్షుడు వెంకటయ్య
పరిగి/ వికారాబాద్, వెలుగు: మాలలు ఆత్మగౌర పోరాటం చేస్తున్నారని వికారాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు సుల్తాన్పూర్ వెంకటయ్య పేర్కొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపుమేరకు ఆయన ఆధ్వర్యంలో ఆదివారం పరేడ్‌గ్రౌండ్ లో నిర్వహించే మాలల సింహగర్జనకు పరిగి నుంచి మాలలు, మాల మహానాడు నాయకులు భారీగా తరలివెళ్లారు. తొలుత కొడంగల్ చౌరస్తా దగ్గర జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలవేసి, అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా నుంచి 25 వేల మంది సభకు బయలుదేరారు.