వర్గీకరణను వ్యతిరేకిస్తూ 14న రాష్ట్ర బంద్​ : రామ్మూర్తి

వర్గీకరణను వ్యతిరేకిస్తూ 14న రాష్ట్ర బంద్​ : రామ్మూర్తి

గోదావరిఖని, వెలుగు: ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 14 న రాష్ట్ర బంద్‌‌‌‌‌‌‌‌ చేపట్టనున్నట్లు మాలమహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్ తెలిపారు. సోమవారం గోదావరిఖని ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద వర్గీకరణ నిర్ణయం తీసుకొని అటు మాలలు సంతోషంగా లేకుండా, ఇటు మాదిగలు సంతోషంగా లేకుండా చేశారన్నారు. 

రాజకీయ పార్టీలు దళితులను, బీసీలను రాజకీయంగా ఎదగకుండా కుట్రలు చేస్తున్నాయని, వాటి మాయలో పడొద్దని అన్నారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌లో మాలమహానాడు ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు దేవి లక్ష్మీనర్సయ్య, దేవరపల్లి మధుబాబు, రాజకిశోర్, శ్రీశైలం, రమణ, రాములు, సుధీర్ పాల్గొన్నారు.