మాలల సింహగర్జన.. తెలంగాణ వ్యాప్తంగా తరలివస్తున్న మాలలు

మాలల సింహగర్జన.. తెలంగాణ వ్యాప్తంగా తరలివస్తున్న మాలలు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మాలల సింహగర్జనకు  తెలంగాణ నలుమూలల నుంచి మాలలు తరలివస్తున్నారు. కార్లు,బస్సులు,బైక్ లతో ర్యాలీలుగా సింహగర్జన సభకు బయల్దేరారు. 

 హుజురాబాద్ నుంచి  మాల ప్రతినిధులు బయల్దేరారు.  అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి భారీ ఎత్తున వస్తున్నారు. జగిత్యాల జిల్లా నుంచి  బస్సులు, కార్లలో వేల సంఖ్యలో హైదరాబాద్ కు బయల్దేరారు.  జిల్లా వ్యాప్తంగా సుమారు 150 బస్సులు, 150 కార్లలో సింహగర్జనకు వస్తున్నారు నేతలు.  కోరుట్ల నియోజకవర్గం నుంచి దాదాపు 55 బస్సులలో బయలుదేరారు మాల సంఘాల సభ్యులు నాయకులు.  ఖమ్మం నుంచి భారీగా బయల్దేరారు మాల ప్రతినిధులు.  వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి బయలుదేరారు మాల విద్యార్థి  నేతలు.


డిసెంబర్ 1న మధ్యాహ్నం  సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మాలల సింహగర్జన సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. 200మంది అతిథులు కూర్చునేలా వేదిక ఏర్పాటు చేశారు.  ఈ సభకు తెలంగాణ, ఏపీ నుంచి  పెద్దఎత్తున మాలలు తరలిరానున్నారు. ఈ మీటింగ్ ను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, మాలమహానాడు ప్రెసిడెంట్ చెన్నయ్య కొన్ని రోజులుగా అన్ని జిల్లాల నేతలతో మీటింగ్ లు నిర్వహిస్తూ ఏర్పాట్లను పరిశీలించారు. 

మాలల సింహగర్జన సభను విజయవంతంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి పిలుపునిచ్చారు.  ఇది హక్కుల కోసం నిర్వహిస్తున్న మీటింగ్ తప్ప.. ఎవ్వరికీ వ్యతిరేకం కాదన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మాలల్లో యూనిటీ వచ్చిందని.. రానున్న రోజుల్లో ఐక్యత కొనసాగించాలన్నారు వివేక్ వెంకట స్వామి. రాష్ట్రంలో  ఉన్న 30లక్షల మంది మాలలు ఉన్నారని..మీటింగ్ తో తమ సత్తా చూపుతామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 

ఇక సభ ఉండటంతో  సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో  ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు  ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తెలిపారు. పంజాగుట్ట, బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు సభ కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు.