రాను రాను జనాలు సమాజంలో పాపులర్ కావడానికి వారు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఈ రోజు ఏ కూర తిన్నామో కూడా పోస్ట్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియా.. ఎంతలా ఎదిగిందో వేరే చెప్పనక్కరలేదు. ఇప్పుడు తాజాగా ఓ మహిళ ఇన్స్ట్రాలో చేసిన పోస్ట్ లో నా పెంపుడు పాము చనిపోయిందంటూ ఆ యువతి ఎమోషనల్ గా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మహిళ ఓ పామును ముద్దుపెట్టుకుంటా.. ఈ కోబ్రాను తన కొడుకుగా భావించానని.. ఆ పాము మరణాన్ని తట్టుకోలేకపోతున్నానని విచారకరమైన పోస్ట్ ను రాశారు. మలయ్ భాషలో రాసిన క్యాప్షన్ ఉంది కాబట్టి మలేషియాకు చెందిన మహిళగా భావించవచ్చు. ఆ మహిళ కింగ్ కోబ్రానుదగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఈ పాము ( నాకొడుకు) లేకుండా నేను ఉండలేనని భావోద్వేగంగా పోస్ట్ ఉంది. చాలా సంవత్సరాలు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఈ రోజు తాను ఇలా ఉన్నానంటే.. అది దాని వల్లేననని రాశారు. ఈ పోస్టులో పాముకు వీడ్కోలు పలికింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. ఈ వీడియోకు 5 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ అమ్మాయి వీడియోలు పోస్ట్ చేయడం మానేసే రోజు వస్తుందని కొంతమంది కామెంట్ చేశారు. మరొకరు నాగుపాము కూడా ఆమె విషానికి భయపడిందా అని ప్రశ్నించారు.