తెలుగులో స్టార్ డైరెక్టర్ మారుతి ది రాజాసాబ్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా బ్యూటిఫుల్ హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ది రాజాసాబ్ మోషన్ పోస్టర్ వీడియో రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మాళవిక మోహనన్ ది రాజాసాబ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని ప్రేక్షకులతో పంచుకుంది. ఈ క్రమంలో ప్రభాస్ తో కలసి నటిస్తున్నందుకు చాల సంతోషంగా ఉందని తెలిపింది. ఐతే తాను కూడా గత కొన్నేళ్లుగా తెలుగులో స్ట్రైట్ సినిమాలో నటించి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పటికీ కుదరలేదని కానీ ది రాజాసాబ్ చిత్రంతో తన కల నెరవేరబోతుందని అనందం వ్యక్తం చేసింది. ఇక ది రాజాసాబ్ సినిమా లైట్ హార్ట్- రోమ్ కామ్ గా ఉండనుందని దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
Also Read :- మనిషి కలల్ని తట్టిలేపే.. ఈ మోటివేషనల్ సాంగ్ విన్నారా!
ఈ విషయం ఇలా ఉండగా మాళవిక మోహనన్ మలయాళ ప్రముఖ డైరెక్టర్ అళగప్పన్ డైరెక్ట్ చేసిన పిట్టం పోలె అనే చిత్రం ద్వారా 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు లభిచలేదు. కానీ 2021లో ప్రముఖ స్టార్ హీరోలైన విజయ్ దళపతి, విజయ్ సేతుపతి నటించిన మల్టీస్టారర్ మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించడంతో బ్రేక్ వచ్చింది. దీంతో అప్పటినుంచి హిందీ, మలయాళం, తమిళ్ తదితర భాషల్లో వరుస సినిమాలలో నటిస్తోంది.