వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళ్తోంది మాళవిక మోహనన్. సౌత్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆమె తెలుగులో ప్రభాస్‌కు జంటగా ‘రాజా సాబ్’లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో ‘రాజాసాబ్’ గురించి ఆసక్తికర అప్‌డేట్ షేర్ చేసింది మాళవిక. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయిందని, అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని చెప్పింది.
అలాగే తెలుగులో తన ఫేవరేట్ హీరో ప్రభాస్ అని, డెబ్యూ సినిమాకే ఆయనతో నటించే చాన్స్ రావడం చాలా హ్యాపీ అంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ మరో హీరోయిన్‌గా నటిస్తుంది. రొమాంటిక్ హారర్ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.