![Prithviraj Sukumaran: పృథ్వీరాజ్కి మెగా ఆఫర్.. కానీ.. రెండుసార్లూ రిజెక్ట్ చేశాడట!](https://static.v6velugu.com/uploads/2024/03/malayala-actor-prithviraj-sukumaran-interesting-comments-on-megastar-chiranjeevi_lzSjTn7Pbo.jpg)
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య ప్రభాస్ తో సలార్ సినిమాలో నటించిన ఆయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ నటుడు ది గోట్ లైఫ్(The Goat Life) అనే సినిమా చేస్తున్నాడు. పృథ్వీరాజ్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మార్చ్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సరికొత్త కథా, కథనాలతో వస్తున్న ఈ సినిమా పోస్టర్స్ అండ్ టీజర్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం తెలుగు ఆడియన్స్ సైతం ఈగర్ గావెయిట్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ పాల్గొన్న నటుడు పృథ్వీరాజ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నిజానికి ఇండస్ట్రీలో పనిచేసే ప్రతీ ఒక్కరికి మెగాస్టార్ తో వర్క్ చేయడం అనేది ఒక డ్రీం గా ఉంటుంది. ఆలాంటి అవకాశం పృథ్వీరాజ్కి రెండుసార్లు వచ్చిందట. కానీ, ఆ రెండు సినిమాల్లో ఆయనతో పనిచేసే అవకాశం కుదరలేదట. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతు.. చిరంజీవి గారితో పనిచేసే అవకాశం రెండు సార్లు వచ్చింది. ముందు సైరా సినిమాలో హీరో సుదీప్ చేసిన పాత్రకు నన్ను అడిగారు కానీ, ఆ సమయంలో ది గోట్ లైఫ్ సినిమా కోసం చాలా సన్నగా అయ్యాను. అలా ఆ సినిమా అవకాశం మిస్ అయ్యింది.
ఇక రెండవ సారి లూసిఫర్ రీమేక్ టైంలో వచ్చింది. మలయాళంలో నేను డైరెక్ట్ చేశాను కాబట్టి తెలుగులో కూడా నన్నే డైరెక్ట్ చేయమన్నారు కానీ, ఆ సమయంలో కూడా నేను ది గోట్ లైఫ్ షూటింగ్ లో బిజీగా ఉన్నానని ఆ ఆఫర్ రిజెక్ట్ చేశాను. అలా రెండుసార్లు చిరంజీవి గారితో పనిచేసే అవకాశం మిస్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్. ప్రస్తుతం పృథ్వీరాజ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.