Arundhathi Nair: చావుబ్రతుకుల మధ్య నటి అరుంధతి నాయర్.. వెంటిలేటర్పై చికిత్స

Arundhathi Nair: చావుబ్రతుకుల మధ్య నటి అరుంధతి నాయర్.. వెంటిలేటర్పై చికిత్స

మలయాళం నటి అరుంధతి నాయర్(Arundhathi Nair) రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె కు తీవ్ర గాయాలవ్వగా..   మూడు రోజులుగా తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై తాజాగా ఆమె సోదరి ఆరతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఒక యూట్యూబ్ ఛానెల్ షూటింగ్ ముగించుకున్న ఆమె తిరిగి వస్తుండగా కోవలం బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆమెతో సోదరుడు కూడా ఉన్నాడు. అరుంధతి తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arathy Nair (@aaraty.nairr)

ఈ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలపై వివరణ ఇవ్వాలని అనుకున్నాము. అందుకే ఈ ప్రకటన చేస్తున్నాము. ప్రస్తుతము మా సోదరి అరుంధతికి మీ ప్రార్థనలు అవసరం. ఆమె కోసం మీరు ప్రార్థించండి. అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు ఆరతి. ప్రస్తుతం ఆరతి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అరుంధతీ నాయర్ సినిమాల విషయానికి వస్తే.. తమిళ చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన ఆమెకు విజయ్ ఆంటోనితో చేసిన సైతాన్(తెలుగులో భేతాళుడు) సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాత ఒట్టక్కరు అకవంకన్ అనే మలయాళ సినిమా చేసింది.