
తిరువనంతపురం: మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు అజిత్ విజయన్ (57) కన్నుమూశారు. ఆయన తన నివాసంలో మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒరు ఇండియన్ ప్రణయకథ, బెంగళూరు డేస్, అమర్ అక్బర్ అంథోని, అంజు సుందరికల్ తదితర సినిమాల్లో ఆయన నటించారు. ఇటు తెలుగు చిత్రాలలో కూడా యాక్ట్ చేసి తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు. విజయన్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయనకు భార్య ధన్య, కుమార్తెలు గాయత్రి, గౌరీ ఉన్నారు.