RC 16 Casting: RC16లో మలయాళ యాక్టర్..రామ్ చరణ్తో తగ్గ పోరు ప‌క్కా!

RC 16 Casting: RC16లో మలయాళ యాక్టర్..రామ్ చరణ్తో తగ్గ పోరు ప‌క్కా!

గ్లోబల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్(Ram Charan), ఉప్పెన ఫేమ్ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా(Buchi Babu Sana) క‌ల‌యిక‌లో తెర‌కెక్క‌తోన్న కొత్త సినిమా (RC16) ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో గ్రాండ్ గా షురూ అయింది. స్పోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ రిస్ఠిక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ నటిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ మూవీలో కన్నడ శివన్న,కోలీవుడ్ విజయ్ సేతుపతి నటిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా మలయాళ యాక్టర్ ఆర్‌డీఎక్స్ ఫేమ్ ఆంటోనీ వ‌ర్గీస్ (Antony Varghese) RC 16లో జాయిన్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆంగ‌మ‌లై డైరీస్ ద్వారా మ‌ల‌యాళం సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు వర్గీస్.ఆ తర్వాత స్వాతంత్య్రం అర్థ‌రాత్రియాల్‌,జ‌ల్లిక‌ట్లుతో పాటు ప‌లు సినిమాల్లో హీరోగా,యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లు చేస్తూ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ మూవీలో ఆంటోనీ వ‌ర్గీస్ విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు టాక్. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  

దీన్ని బట్టి చూస్తే..బుచ్చిబాబు తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ,హిందీ, భాష‌ల‌కు చెందిన స్టార్ హీరోలు..యాక్టర్స్ ను పలు కీల‌క పాత్ర‌ల కోసం ఎంపిక చేస్తున్నట్లు టాక్. అయితే, ఈ సినిమా పాన్ ఇండియాను మించి ఉండేలా బుచ్చిబాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు సినీ సర్కిల్ లో గుసగుసలు మొదలయ్యాయి.  

RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kappoor) హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్(AR Rahaman) సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, వ్రిద్ది సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 20 లాంఛనంగా పూజ కార్యక్రమాలతో మొదలయింది.ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్.