నేనూ అందరిలాంటివాడినే.. నాకేం ప్రత్యేక అధికారాలు లేవు.. వీడియో షేర్ చేస్తూ నటుడు క్షమాపణలు

నేనూ  అందరిలాంటివాడినే.. నాకేం ప్రత్యేక అధికారాలు లేవు.. వీడియో షేర్ చేస్తూ నటుడు క్షమాపణలు

మలయాళ నటుడు బైజు సంతోష్ (Baiju Santhosh) ఆదివారం (అక్టోబర్ 13న) అర్థరాత్రి 12 గంటల సమయంలో మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తూ తన కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. దాంతో తాగి డ్రైవ్ చేశాడంటూ తనపై వస్తోన్న ఆరోపణలపై నటుడు బైజు సంతోశ్‌ బుధవారం (అక్టోబర్ 16న) సోషల్ మీడియా వేదికగా వీడియోలో స్పందించారు.

" ఆదివారం కవడియార్ వైపు నుంచి వెల్లయంబలం వెళ్తున్న సమయంలో.. కారు టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి స్కూటరిస్టును ఢీకొట్టా, తరువాత నేనే ఆ యువకుడిని లేపా. ఆసుపత్రికి వెళ్లాలా అని అడిగా, ఎలాంటి సమస్య లేదు అన్నాడు. పోలీసులెవరూ నాకు సహాయం చేయలేదు, వాళ్లు లీగల్ కేసు పెట్టారు. నేనూ అందరిలాంటివాడినే. చట్టానికి కట్టుబడి ఉంటా. నాకేం ప్రత్యేక అధికారాలు లేవు.

అయితే, నిజం తెలుసుకోకుండా పలు వెబ్‌సైట్లు తమకు తోచింది రాశాయి. దానిపై స్పష్టత ఇవ్వడానికే  మీ ముందుకొచ్చా. టైరు పేలిపోవడం వల్ల కారుని అదుపుచేయలేకపోయా. అందుకే ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో నేను మద్యం సేవించి ఉన్నాననేది అవాస్తవం" అంటూ ఆయన వీడియోలో చెప్పుకొచ్చారు.

ప్రమాదం జరిగిన రోజున బైజు కారుని పోలీసులు స్వాధీనం చేసుకుని ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటివాటిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.అనంతరం నటుడు సోమవారం అక్టోబర్ 14న  బెయిల్ పై విడుదల అయ్యారు. దీంతో ఈ ఘ‌ట‌న కేర‌ళ నాట బాగా వైర‌ల్ అవ్వడంతో తాజాగా క్లారిటీ ఇచ్చాడు. 

ఈ విషయం ఇలా ఉండగా నటుడు నటుడు బైజు సంతోష్ ఇప్పటివరకూ దాదాపుగా 100కి పైగా చిత్రాల్లో నటించాడు. కెరీర్ ఆరంభంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడంతోపాటూ హీరోగా కూడా నటించాడు. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.