4వ పెళ్లి చేసుకున్న స్టార్ హీరో.. ఆస్తి కోసమే అంటూ కామెంట్లు..

4వ పెళ్లి చేసుకున్న స్టార్ హీరో.. ఆస్తి కోసమే అంటూ కామెంట్లు..

మలయాళ ప్రముఖ నటుడు బాలా 4వ పెళ్లి చేసుకున్నాడు.తన మేనమామ కూతురైనా కోకిల అనే యువతిని ఈరోజు (అక్టోబర్ 23) ఉదయం 8.30 గంటలకు ఎర్నాకులంలోని కలూర్ పావకులం ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే నటుడు బాలా భార్య కోకిల దగ్గరి బంధువు కావడంతో ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్ళికి అంగీకరించి ఆశీర్వదించారు. 

బాలా భార్య కోకిల తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి నటుడు బాలా ని ప్రేమిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే గతంలో నటుడు బాలా కి 3 పెళ్ళిళ్ళయ్యి విడాకులైనప్పటికీ కోకిల బాలా ని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం. అయితే కోకిల కుటుంబ సభ్యులు చెన్నై ప్రాంతంలో పలు వ్యాపారాలు చేస్తూ బాగానే స్థిరపడ్డారు. దీంతో పెళ్లి అనంతరం నటుడు బాలా వారి ఆస్తుల వ్యవహారాలను చూసుకుంటూ చెన్నైలో స్థిరపడేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ALSO READ | Nehashetty: ఎర్ర చీరలో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నేహా లాట్ ఆఫ్ యాటిట్యూడ్

అయితే పెళ్లి అనంతరం నటుడు బాలా విలేఖర్లతో మాట్లాడారు. ఇందులో భాగంగా తనకి ఇటీవలే కాలేయ మార్పిడి సర్జరీ జరిగిందని దాంతో తనకి తోడు అవసరం అనిపించి మళ్ళీ పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. ఇక కోకిల నాకు దగ్గరి బంధువు కావడంతో మా దాంపత్య జీవితం బాగుంటుందని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఈ విషయం ఇలా ఉండగా నటుడు బాలా గతంలో 3 పెళ్లిళ్లు చేసుకుని తన ముగ్గురి భార్యలకు విడాకులు ఇచ్చాడు. దీంతో ఈ 4వ పెళ్లి విషయం సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది. ఈ క్రమంలో కొందరు నటుడు బాలా కోకిలని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా డబ్బుంటే ఏదైనా సాధ్యమేనని, అలాగే డబ్బున్నవారికి వయసుతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకోవచ్చని ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.