మలయాళ స్టార్ జోజు జార్జ్ హీరోగా నటిస్తూ రూపొందించిన చిత్రం ‘పని’. అభినయ హీరోయిన్. మలయాళంలో మెప్పించిన ఈ చిత్రాన్ని ఆమ్ వర్డ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ తెలుగులో డిసెంబర్ 13న రిలీజ్ చేస్తుంది.
ఈ సందర్భంగా డిసెంబర్ 10 న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు దర్శకుడు వీర శంకర్, నిర్మాత దామోదర ప్రసాద్ హాజరై సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు.
జోజు జార్జ్ మాట్లాడుతూ ‘మంచి సినిమాకు భాషా పరమైన హద్దులు లేవు. కంటెంట్ నచ్చితే ఏ భాషలోనైనా ఆదరిస్తారు. తెలుగు చిత్రాల్లో నటించి మీ ఆదరణ పొందాను. ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. తెలుగు ఆడియెన్స్‌కు బాగా నచ్చుతుంది’ అని చెప్పాడు. ఈ చిత్రం తనకు ఎన్నో మెమొరీస్ ఇచ్చింది అని అభినయ చెప్పింది. టీమ్ అంతా పాల్గొన్నారు.
పని' కథ విషయానికొస్తే.. రివేంజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కింది. కానీ జోజూ జార్జ్ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని తెలుస్తోంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మలయాళంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాలు చేశాడు జోజూ జార్జ్. గతంలో తెలుగులో 'ఆదికేశవ' మూవీలో విలన్‌గా ఇతడు నటించాడు.