ప్రముఖ కమెడియన్ ప్రదీప్ మృతి

ప్రముఖ కమెడియన్ ప్రదీప్ మృతి

తిరువనంతపురం: ప్రముఖ మలయాళ నటుడు, కొట్టాయం ప్రదీప్గా పేరొందిన ప్రదీప్ కేఆర్ గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. 61 ఏళ్ల ప్రదీప్ ఆకస్మిక మరణం మలయాళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మలయాళం, తమిళంతోపాటు తెలుగులోనూ పలు సినిమాల్లో ప్రదీప్  నటించారు. అక్కినేని నాగచైతన్య నటించిన ‘ఏ మాయ చేశావే’ మూవీలో ప్రదీప్ యాక్ట్ చేశారు. జార్జ్ అంకుల్ పాత్రలో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన మరణంపై దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విచారం వ్యక్తం చేశారు. ఆయనకు నివాళి అర్పించారు. 

మరిన్ని వార్తల కోసం:

మైనస్ డిగ్రీల టెంపరేచర్లో జవాన్ల పెట్రోలింగ్

భగవంత్ మాన్ ఓ తాగుబోతు 

చనిపోయిన వ్యక్తికి బూస్టర్ వేశారట!